Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గచ్చిబౌలిలో రూ.1.76 లక్షలు పలికిన చదరపు గజం భూమి

Gachibowli Land Price Reaches Rs 176 Lakh Per Square Yard
Advertisement
  • నగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు భూముల వేలం
  • కేపీహెచ్‌బీ కమ్యూనిటీ హాలులో 14 స్థలాల వేలం
  • బాలాజీనగర్‌లో చదరపు గజం రూ.1.64 లక్షలు
Advertisement
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చదరపు గజం భూమి రూ.1.76 లక్షలు పలికింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములను వేలం వేయగా అధిక ధరలు పలికాయి. కేపీహెచ్‌బీ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన ఈ వేలంలో 50 మంది బిల్డర్లు పాల్గొన్నారు.

గచ్చిబౌలి, బౌరంపేట, కూకట్ పల్లి బాలాజీనగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 స్థలాలను బహిరంగ వేలం వేశారు. ఇందులో గచ్చిబౌలి భూమి చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్ పల్లి బాలాజీనగర్‌లో చదరపు గజం రూ.1.64 లక్షలు పలికింది. బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరింది.
Advertisement
Advertisement
Gachibowli
Hyderabad
Housing Board
Land Auction
Real Estate
Kukatpally
Bala Nagar

More Telugu News